1) సూర్యోదయమునకు ముందుగానే నిద్రలేవాలి.
2) సూర్యోదయమునందు నిద్రించువాడు అభినిర్ము క్తుడు అను పాతకుడగును.
3) సూర్యాస్తమయ మందు నిద్రించువాడు అంశుమాన్ అను పాతకుడగును.
4) సూర్యునికి ఎదురుగా దంతధావన చేయరాదు. దంతధావన మధ్య వేలితో చేయవలెను.
5) దంతధావన నడుస్తూ చేయరాదు. ఉమ్మిలో పాచి వుండుట వలన చీమలు మొ॥ తిని మరణించును. అ పాపము వుమ్మిన వారికి కలుగును.
6) మలమూత్ర విసర్జనములు సూర్య చంద్రులకు ఎదురుగా చేయరాదు. గాలికి ఎదురుగా చేయవలెను.
(ఆరోగ్యమునకు మంచిది కనుక)
7) తెల్లవారుఝామున
4-5 గం॥ మధ్య చేయు స్నానము ఋషిస్నానము
5-6 గం॥ మధ్య చేయు స్నానము దైవస్నానము
6-7 గం॥ మధ్య చేయు స్నానము మానవస్నానము
7 గం॥ తర్వాత చేయు స్నానము రాక్షసస్నానము.
8) చన్నీటి స్నానము ఉత్తమము.
ఉదకమున స్నానము ఉత్తమోత్తము.
చెరువులో స్నానము మధ్యమము.
నూతి వద్ద స్నానము అధమము.
మిగిలిన స్నానములకు పేర్లులేవు. వేయి పసులున్నను మాని సకాలములో స్నానము చేయవలెను.
9) ప్రవాహమునకు ఎదురుగా పురుషులు, వాలుగా స్త్రీలు స్నానము చేయవలెను. (కుమారస్వామి జననము ఆధారముగా).
10) ఒక నదిలో స్నానము చేయుచు మరొక నదిని దూషించరాదు.
11) చన్నీటి స్నానము, శిరస్సు తడుపుకొని ప్రారంభించవలెను. (శిరస్సు నందు జ్ఞాన కణములుండును కావున భించవలెను. వాటిని రక్షించుకొనుటకు)
12) వేడినీటి స్నానము పాదములు తడుపుకొని ప్ర్రారంభించవలేను. (నరములకు బలము కనుక)
13) స్నానము చేయునపుడు దేహమును పైనుండి క్రిందికి రుద్దుకొనిన కామేచ్ఛ పెరుగును. అడ్డముగా రుద్దుకొనిన కామం నశించును.
14) సముద్ర స్నానమునకు వెళ్ళునప్పుడు ముందుగా చన్నీటి స్నానముచేసి, సముద్ర స్నానము చేయవలెను. తరువాత మరల చన్నీటి స్నానము చేయవలెను.
15) 15 ని॥దాటి సముద్రములో స్నానము చేసినచో పుంసత్వము నశించును.
16) శుక్ర, మంగళ వారములలో సముద్రస్నానం చేయరాదు.
17) సముద్రస్నానము వైశాఖ, ఆషాఢ, కార్తీక మాఘమాసములందు, అర్ధోదయ, మహోదయ సమయముల యందు చేయవలెను.
18) సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టిని లోపల వేయవలెను. (సముద్రుని మా ఊరు రావద్దని)
19) నదులు, కాలువలు, చెరువులలో స్నానమునకు వెళ్ళినపుడు, లోపల మట్టిని ముమ్మారు బయట వేయాలి. (అవి శాశ్వతంగా వుండుట కొరకు).