Hot Widget

Ticker

6/recent/ticker-posts

తిరుమల లడ్డూకు 306 ఏళ్ళు

తిరుమల లడ్డూకు 306 ఏళ్ళు


తిరుమల లడ్డూకు 306 ఏళ్ళు ||


తిరుపతి ఏడుకొండల వెంకన్న లడ్డూకు 306 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌డే, గ్రీటింగ్స్ వైరల్..


తిరుమల లడ్డూకు 306 ఏళ్ళు కరెక్టేనా..


▪️తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. స్వామి వారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతుంటారు. తిరుమలకు వెళ్లిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు దొరికితే బాగుండు అనుకునే భక్తులు చాలామందే ఉంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని మరికొందరు భావిస్తారు. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ఎప్పుడు తయారైంది.. ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందనే విషయంలో చాలామందికి చాలా అనుమానాలున్నాయి.


▪️ అయితే సామాజిక మాధ్యమాల్లో తిరుమల లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టు బాగా వైరల్ అవుతోంది.


శ్రీవారి లడ్డూకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!


▪️ గ్రీటింగ్ వైరల్


▪️ చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. రకరకాలైన ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టులో ప్రారంభమైందని అంటారు. ఆగస్టు 2వ తేదీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ సరైన తేదీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే హ్యాపీ బర్త్‌డే తిరుమల లడ్డూ అంటూ గ్రీటింగ్ కార్డుతో కూడిన ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు నెటిజన్లు


▪️ శ్రీవారి లడ్డూకు జీఐఎస్


రోజుకు మూడు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీ సొంతం. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతారు టీటీడీ అధికారులు. నిత్యం వందలాది మంది లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్‌ను ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు. బూందీ క్రేట్స్‌తో పాటు లడ్డూలను మోసుకుపోయేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం. అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో "జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్" కూడా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.


▪️ ఇదీ కథ.. మరీ ఇప్పుడు లడ్డూకు ఎన్నేళ్లు..!


శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 306 సంవత్సరాల కిందటే మొదలైందని, స్వామి వారి లడ్డు పుట్టినరోజు 1715, ఆగస్టు 2 అని.. ఆ క్రమంలో ఇవాళ 306వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు బాగా వైరల్ అవుతోంది. దాంతో శ్రీవారి లడ్డూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. అయితే ఇది నిజమా కాదా అని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీవారి ప్రసాదం క్రీ.శ. 1803లో బూందీగా పరిచయమైందని.. 1940 నాటికి లడ్డూగా మారి స్థిరపడినట్లు తెలుస్తోంది.


▪️ ఇంతకూ 306 ఏళ్లా.. 81 సంవత్సరాలా..!


తొలి రోజుల్లో లడ్డూ పరిమాణం "కల్యాణోత్సవం లడ్డూ" అంతగా ఉండేది. ధర కూడా ఎనిమిదణాలే ఉండేదట. ఆ తర్వాత 2, 5, 10, 15 రూపాయల నుంచి 25 రూపాయలకు చేరింది. అలా దాదాపు పదేళ్ల పాటు అదే ధరకు అందించిన టీటీడీ.. సంవత్సర కాలం నుంచి 50 రూపాయలకు పెంచింది. అంతేకాదు ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథుల కోసం 750 గ్రాముల ఆస్థానం లడ్డూ, కల్యాణోత్సవం లడ్డూ, భక్తులకు ఇచ్చే 175 గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డూ తయారు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గ్రీటింగ్ కార్డు ప్రకారం శ్రీవారి లడ్డూ పుట్టి 306 ఏళ్లు కాలేదన్నమాట. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయస్సు 81 సంవత్సరాలు అన్నమాట.