Hot Widget

Ticker

6/recent/ticker-posts

AP TET Special | Telugu తెలుగు సంధులు

 తెలుగు సంధులు

నా చిన్నప్పుడు చేసిన పనులు గుర్తుకు వచ్చాయి.

గమనిక :
పై వాక్యంలో “చిన్నప్పుడు” అనే పదం, చిన్న + అప్పుడు అనే రెండు పదాలు కలవడం వల్ల వచ్చింది. దీనినే “సంధి పదం” అంటారు. ఉచ్చరించడంలో సౌలభ్యం కోసం, రెండు పదాలను వెంట వెంటనే కలిపి మాట్లాడవలసినప్పుడు,

లేదా రాయవలసినప్పుడు, “సంధి పదం” ఏర్పడుతుంది.

తెలుగు సంధులు :
రెండు తెలుగుపదాల మధ్య జరిగే సంధులను “తెలుగు సంధులు” అంటారు.

సంధి :
వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల (అచ్చుల) కలయికను “సంధి” అని పిలుస్తారు.

సంధి కార్యం :
రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును “సంధి కార్యం” అని పిలుస్తారు.

పూర్వ స్వరం :
సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును, (స్వరాన్ని) “పూర్వ స్వరం” అని పిలుస్తారు.

పర స్వరం :
సంధి జరిగే రెండవ పదము మొదటి అక్షరములోని అచ్చును (స్వరాన్ని) “పర స్వరం” అని పిలుస్తారు.
ఉదా :
రామ + అయ్య : ‘మ’ లో ‘అ’, పూర్వ స్వరం; ‘అయ్య’ లోని ‘అ’ పర స్వరం.

1. అత్వ సంధి
సూత్రం : అత్తునకు సంధి బహుళము.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
మేనల్లుడు = మేన + అల్లుడు = (న్ +) అ + అ = అ = (అత్వ సంధి)
1)
ఒకప్పుడు = ఒక + అప్పుడు = (అ + అ = అ) = (అత్వ సంధి)
2)
వచ్చినందుకు = వచ్చిన + అందుకు = (అ + అ = అ) = (అత్వ సంధి)
3)
రాకుంటే = రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = (అత్వ సంధి)
4)
లేకేమి = లేక + ఏమి = (అ + ఏ = ఏ) = (అత్వ సంధి)
5)
పోవుటెట్లు = పోవుట + ఎట్లు = (అ + ఎ = ఎ) = (అత్వ సంధి)

గమనిక :
పై సంధి పదాలలోని పూర్వ స్వరం ‘అ’. అది పర స్వరంలోని అచ్చుతో కలిస్తే పూర్వ స్వరం ‘అ’ లోపిస్తుంది. ‘అ’ లోపించింది కాబట్టి ‘అత్వ సంధి’.

అత్వసంధి లేక ‘అకారసంధి’ అంటారు. పొట్టి ‘అ’ అనే అక్షరానికి అచ్చు పరమైతే ‘అత్వ సంధి’ వస్తుంది.

* అత్వ సంధి (అకార సంధి) సూత్రం :అత్తునకు సంధి బహుళము.

2. ఇత్వ సంధి
సూత్రం :ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.
ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) ఏమంటివి = ఏమి + అంటివి = (ఇ + అ = అ) = (ఇత్వ సంధి)
సంధి జరుగనప్పుడు “య కారం” ఆగమంగా వస్తుంది. దానినే ‘యడాగమం’ అని పిలుస్తారు.

ఆ) ఏమియంటివి = ఏమి + య్ + అంటివి = (ఇ + అ = య) : (ఇకారసంధి రాని యడాగమరూపం)

గమనిక :
ప్రథమ, ఉత్తమ పురుష బహువచన క్రియల ఇకారమునకు సంధి వైకల్పికంగా జరుగుతుంది.
వచ్చిరిపుడు = వచ్చిరి + ఇపుడు – (ఇ + ఇ + ఇ) – (ఇత్వ సంధి)
వచ్చిరియిపుడు = వచ్చిరి + య్ + ఇపుడు – (ఇ + ఇ + యి) (యడాగమం వచ్చిన రూపం)

గమనిక :
పై ఉదాహరణములలో హ్రస్వ ఇకారానికి అచ్చు కలిసినపుడు సంధి జరిగింది. దీనిని “ఇత్వసంధి” అంటారు. ఇత్వ సంధి తప్పక జరుగాలన్న నియమం లేదు.

వైకల్పికం :
ఇత్వ సంధి జరుగవచ్చు లేక జరుగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని “వైకల్పికం” అని పిలుస్తారు.
అభ్యాసము :
ఉదా :
1)
ఏమంటివి = ఏమి + అంటివి = (మ్ + ఇ + అ = మ)
2)
పైకెత్తినారు = పైకి + ఎత్తినారు – (ఇ + ఎ = ఎ) = ఇత్వ సంధి
3)
మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు = (ఇ + అ = అ) = ఇత్వ సంధి

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. ఉత్వ సంధి
ఉకారసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యం.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
రాముడతడు = రాముడు + అతడు = (డ్ + ఉ + అ = డ) = (ఉత్వ సంధి)
1)
అతడెక్కడ = అతడు + ఎక్కడ = (ఉ + ఎ = ఎ) = (ఉత్వ సంధి)
2)
మనమున్నాము = మనము + ఉన్నాము = (ఉ + ఉ = ఉ) = (ఉత్వ సంధి)
3)
మనసైన = మనసు + ఐన = (ఉ + ఐ = ఐ) = (ఉత్వ సంధి)

గమనిక :
హ్రస్వ ఉకారానికి, అనగా ఉత్తుకు, అచ్చు కలిసినప్పుడు, పూర్వ స్వరం ఉకారం లోపించి, పర స్వరం కనిపిస్తుంది. లోపించిన పూర్వ స్వరం ‘ఉ’ కాబట్టి, ఇది “ఉత్వ సంధి” అని పిలువబడుతుంది.

ఉత్వ సంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యం.
నిత్యం : నిత్యం అంటే, తప్పక సంధికార్యం జరుగుతుందని అర్థం

4. యడాగమం సంధి
సూత్రం : సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అని పిలుస్తారు.

ఈ కింది పదాలను విడదీయండి.
ఉదా :
అ) మాయమ్మ = మా + అమ్మ = మాయమ్మ
ఆ) మాయిల్లు = మా + ఇల్లు = మాయిల్లు
ఇ) హరియతడు = హరి + అతడు = హరియతడు

గమనిక :
పై ఉదాహరణలలో సంధి జరుగలేదు. కాని కొత్తగా ‘య్’ వచ్చి చేరింది. అలా చేరడం వల్ల ఈ కింది విధంగా మార్పు జరిగింది.
అ)మా + య్ + అమ్మ = మా ‘య’ మ్మ
ఆ)మా + య్ + ఇల్లు = మా ‘ఋ’ ల్లు
ఇ) హరి + య్ + అతడు = హరి ‘య’ తడు

యడాగమం :
సంధి లేనిచోట అచ్చుల మధ్య “య్” వచ్చి చేరడాన్ని “యడాగమం” అంటారు.

5. ఆమ్రేడిత సంధి
సూత్రం : అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరుచుగా వస్తుంది.

ఆమ్రేడితం :
మొదట పలికిన పదమునే తిరిగి పలుకుతాము. అలా రెండవమారు పలికిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటాము.
ఉదా :
1) ‘
ఆహా + ఆహా ఆహా అనే పదం రెండుసార్లు వచ్చింది. అందులో రెండవ ఆహా అనే దాన్ని ఆమ్రేడితం అని పిలవాలి.
2)
అరెరె – అరె + అరె : రెండవసారి వచ్చిన ‘అరె’ ఆమ్రేడితం.
3)
ఔరౌర = ఔర + ఔర – రెండవసారి వచ్చిన ‘ఔర’ ఆమ్రేడితం.

గమనిక :
పై ఉదాహరణములలో ఒక్కొక్క పదం రెండుసార్లు వచ్చింది. రెండవసారి వచ్చిన పదాన్ని ‘ఆమ్రేడితం’ అంటారు.
ఆమ్రేడిత సంధికి ఉదాహరణములు :
ఔర + ఔర = ఔర్ + అ
ఆహా + ఆహా ఆహ్ + ఆ
ఓహో + ఓహో = ఓహ్ + ఓ

గమనిక :
పై ఉదాహరణములలో పూర్వ పదం అనగా మొదటి పదం చివర, , , ఓ వంటి అచ్చులున్నాయి. ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే, సంధి వస్తుంది.
ఔర + ఔర = ఔరౌర = (అ + ఔ = ఔ)
ఆహా + ఆహా ఆహాహా – (ఆ + ఆ = ఆ)
ఓహో + ఓహో : ఓహోహో = (ఓ + ఓ = ఓ)
ఏమి + ఏమి = ఏమేమి = (ఇ + ఏ = ఏ)
ఎట్లు + ఎట్లు : ఎట్లెట్లు = (ఉ + ఎ = ఎ)
ఏమిటి + ఏమిటి = ఏమిటేమిటి = (ఇ + ఏ = ఏ)
అరె అరె . . అరెరె : (ఎ + అ = అ)
పై విషయాలను గమనిస్తే ఆమ్రేడిత సంధి సూత్రాన్ని ఇలా తయారుచేయవచ్చు.

ఆమ్రేడిత సంధి సూత్రం :
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే, సంధి తరుచుగా అవుతుంది.

గమనిక :
అమ్రేడిత సంధి, కింది ఉదాహరణములలో వికల్పంగా జరుగుతుంది. ఈ కింది ఉదాహరణలను గమనిస్తే, సంధి జరిగిన రూపం, సంధిరాని రూపమూ కనబడతాయి.
ఉదా :
ఏమి + ఏమి = ఏమేమి, ఏమియేమి (సంధి వైకల్పికం)
ఎట్లు + ఎట్లు = ఎట్లెట్లు, ఎట్లు, ఎట్లు (సంధి వైకల్పికం)
ఎంత + ఎంత = ఎంతెంత, ఎంతయెంత (సంధి వైకల్పికం)

6. ఆమ్రేడిత ద్విరుక్తటకారాదేశ సంధి
సూత్రం :ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.
కింది ఉదాహరణలను గమనించండి.
1)
పగలు + పగలు = పట్టపగలు
2)
చివర + చివర = చిట్టచివర
3)
కడ + కడ = కట్టకడ

గమనిక :
1)
పగలు + పగలు : పట్టపగలు అవుతోంది. అంటే ‘ప’ తర్వాత ఉన్న ‘గలు’ అన్న అక్షరాలకు బదులుగా, ‘ట్ట’ వచ్చింది. ‘ట్ట’ వచ్చి, ‘పట్టపగలు’ అయింది.

2) చివర + చివర అన్నప్పుడు ‘చి’ తర్వాత రెండక్షరాల మీద ‘మీ’ వచ్చి, ‘చిట్టచివర’ అయింది.
3)
కడ + కడ అన్నప్పుడు ‘డ’ స్థానంలో ‘మీ’ వచ్చి ‘కట్టకడ’ అయింది. ఇప్పుడు కిందివాటిని కలిపి రాయండి.
ఎదురు + ఎదురు = ఎట్ట యెదురు
కొన + కొన = కొట్టకొను
మొదట + మొదట = మొట్టమొదట
బయలు + బయలు = బట్ట బయలు
తుద + తుద = తుట్టతుద

గమనిక :
ఆమ్రేడితం పరంగా ఉంటే, కడ మొదలైన శబ్దాల, మొదటి అచ్చు మీద అన్ని అక్షరాలకు ‘ట్ట’ వస్తుండడం గమనించాము.

సూత్రం :
ఆమ్రేడితం పరమగునపుడు, కడాదుల, తొలి యచ్చు మీది వర్ణముల కెల్ల అదంతంబగు ద్విరుక్తటకారంబగు.

7. ద్రుతప్రకృతిక సంధి
సరళాదేశ సంధి : ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.

ఈ కింది పదాలు చదివి పదంలోని చివర అక్షరం కింద గీత గీయండి. 1) పూచెను 2) చూచెన్ 3) తినెను 4) చూచెన్ 5) ఉండెన్

గమనిక :
పై పదాలను గమనిస్తే పదాల చివర, ను, చ్ లు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉంది. ఈ నకారాన్ని ‘ద్రుతం’ అంటారు. ద్రుతము చివరన గల పదాలను, “ద్రుత ప్రకృతికములు” అంటారు.

గమనిక :
పూచెను, చూచెన్, తినెను, చూచెన్, ఉండెన్ – అనేవి ద్రుత ప్రకృతికములు.
కింది ఉదాహరణములను గమనించండి.
ఉదా :
అ) పూచెన్ + కలువలు = పూచెన్ + గలువలు
ఆ) దెసన్ + చూచి = దెసన్ + జూచి
ఇ) చేసెన్ + టక్కు = చేసెన్ + డక్కు
ఈ) పాటిన్ + తప్ప = పాటిన్ + దప్ప
ఉ) వడిన్ + పట్టి = వడిన్ + బట్టి
ఊ) చేసెను + తల్లీ : చేసెను + దల్లీ
ఋ) దెసను + చూసి = దెసను + జూసి

గమనిక :
ద్రుత ప్రకృతానికి ‘క’ పరమైతే ‘గ’, ‘చ’ పరమైతే ‘జ’, ‘ఓ’ పరమైతే ‘డ’, ‘త’ పరమైతే ‘ద’, ‘ప’ పరమైతే ‘బ’ ఆదేశంగా వస్తాయి.
1)
క – ‘గ’ గా,
2)
చ – ‘జ’ గా
3)
ట – ‘డ’ గా
4)
త – ‘ద’ గా
5)
ప – ‘బ’ గా మార్పు వచ్చింది.

ఇందులో ‘క చట తప’ లకు, ‘పరుషములు’ అని పేరు, ‘గ జ డ ద బ’ లకు, ‘సరళములు’ అని పేరు. దీనిని బట్టి సరళాదేశ సంధి సూత్రం ఇలా ఉంటుంది.

సూత్రం :
ద్రుత ప్రకృతికము మీది పరుషములకు, సరళములగు.

గమనిక :
ఇప్పుడు పై ఉదాహరణలలో మార్పు గమనించండి.
ఉదా :
పూచెఁ గలువలు ; (ద్రుతం అరసున్నగా మారింది)
పూచెను + కలువలు (పూచెం గలువలు (ద్రుతం సున్నగా మారింది) పూచెనలువలు (ద్రుతం మీద హల్లుతో కలిసి సంశ్లేష రూపం అయ్యింది) పూచెను గలువలు. ద్రుతము మార్పు చెందలేదు) దీనికి సూత్రం చెపితే సూత్రం ఇలా ఉంటుంది.

2వ సూత్రం : ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి, బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
గమనిక :
అంటే ఒక్కోసారి బిందువు వస్తుంది. ఒక్కోసారి సంశ్లేష వస్తుంది.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

8. గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంబుగానగు.

కింది పదాలను ఎలా విడదీశారో గమనించండి.
1)
గొప్పవాడు గదా = గొప్పవాడు + కదా (డు + క)
2)
కొలువు సేసి = కొలువు + చేసి (వు + చే)
3)
వాడు డక్కరి = వాడు + టక్కరి (డు + ట)
4)
నిజము దెలిసి = నిజము + తెలిసి (ము + 3)
5)
పాలువోయక = పాలు + పోయక (లు + పో)

గమనిక :
పై ఉదాహరణలలో పూర్వపదం చివర ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. పరపదం మొదట క, , , , ప లు ఉన్నాయి. ఈ విధంగా ప్రథమావిభక్తి మీద, ప్రత్యయాలు క, , , , ప లు పరమైతే, వాటి స్థానంలో గ, , , , , లు ఆదేశంగా వస్తాయి. అంటే
1)
క – గ – గా మారుతుంది
2)
త – ద – గా మారుతుంది
3)
చ – స గా మారుతుంది
4)
ప – వ గా మారుతుంది
5)
ట – డ గా మారుతుంది.

అంటే క, , , , ప లకు, , , , , వ లు ఆదేశంగా వస్తాయి.

గసడదవాదేశ సంధి సూత్రం :
ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళంబుగానగు

ద్వంద్వ సమాసంలో : గ స డ ద వా దేశ సంధి.

కింది పదాలను గమనించండి
కూరగాయలు = కూర + కాయ + లు
కాలుసేతులు = కాలు + చేయి + లు
టక్కుడెక్కులు = టక్కు + టెక్కు + లు
తల్లి దండ్రులు = తల్లి + తండ్రి + లు
ఊరువల్లెలు = ఊరు + పల్లె + లు

గమనిక :
పై ఉదాహరణలు ద్వంద్వ సమాసపదాలు. పై ఉదాహరణలలో కూడా క చ ట త ప లకు గ స డ ద వ లు వచ్చాయి.
దీన్నే గ స డ ద వా దేశం అంటారు.

గసడదవాదేశ సంధి సూత్రం :
ద్వంద్వ సమాసంలో మొదటి పదంమీద ఉన్న క చ ట త ప లకు, గ స డ ద వలు క్రమంగా వస్తాయి.
కింది పదాలను కలపండి.
1)
అక్క చెల్లి = అక్కాసెల్లెండ్లు
2)
అన్న + తమ్ముడు – అన్నదమ్ములు

9. టుగాగమ సంధి
సూత్రం : కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరమగునపుడు టుగాగమంబగు.

ఈ కింది పదాలను పరిశీలించండి.
నిలువు + అద్దం = నిలువుటద్దం
తేనె + ఈగ = తేనెటీగ
పల్లె + ఊరు = పల్లెటూరు

గమనిక :
వీటిలో సంధి జరిగినపుడు ‘ట్’ అదనంగా చేరింది. ఇలా ‘ట్’ వర్ణం వచ్చే సంధిని ‘టుగాగమ సంధి’ అంటారు.
అలాగే కింది పదాలు కూడా గమనించండి.
1)
చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
2)
పొదరు + ఇల్లు : పొదరుటిల్లు / పొదరిల్లు

గమనిక :
వీటిలో ‘ట్’ అనే వర్ణం, సంధి జరిగినపుడు రావచ్చు. ‘ట్’ వస్తే “టుగాగమం” అవుతుంది. ‘ట్’ రాకుంటే ‘ఉత్వ సంధి’ అవుతుంది.

టుగాగమ సంధి సూత్రం :
కర్మధారయములందు, ఉత్తునకు అచ్చు పరమైతే టుగాగమంబగు.

2) టుగాగమ సంధి (వికల్పం) :
కర్మధారయంబు నందు పేర్వాది శబ్దములకు అచ్చు పరమగునపుడు టుగాగమంబు విభాషనగు.
ఉదా :
1)
పేరు + ఉరము = పేరు టురము / పేరురము
2)
చిగురు + ఆకు = చిగురుటాకు / చిగురాకు
3)
పొదరు + ఇల్లు = పొదరుటిల్లు / పొదరిల్లు

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

10. లులన సంధి
సూత్రం : లులనలు పరమైనపుడు ఒక్కొక్కప్పుడు ముగాగమానికి లోపం, దాని పూర్వ స్వరానికి దీర్ఘం వస్తాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1)
పుస్తకములు – పుస్తకాలు
2)
దేశముల – దేశాల
3)
జీవితమున – జీవితాన
4)
గ్రంథములు – గ్రంథాలు
5)
రాష్ట్రముల – రాష్ట్రాల
6)
వృక్షమున – వృక్షాన

పై పదాల్లో మార్పును గమనించండి.
పుస్తకములు, గ్రంథములు, దేశములు, రాష్ట్రములు, జీవితమున, వృక్షమున – వీటినే మనం పుస్తకాలు, గ్రంథాలు, దేశాలు, రాష్ట్రాలు, జీవితాన, వృక్షాన అని కూడా అంటాం.

గమనిక :
ఈ మార్పులో లు, , న అనే అక్షరాల ముందున్న ‘ము’ పోయింది. ‘ము’ కంటే ముందున్న అక్షరానికి దీర్ఘం వచ్చింది.

లులన సంధి సూత్రం :
లు, , న లు పరమైనప్పుడు, ఒక్కొక్కప్పుడు మువర్ణానికి లోపము, దాని పూర్వ స్వరానికి దీర్ఘమూ వస్తాయి.

11. పడ్వాది సంధి
సూత్రం : పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణ బిందువూ (0) విభాషగా అవుతాయి.
ఈ కింది ఉదాహరణములు గమనించండి.
1)
భయము + పడు = భయంపడు, భయపడు

విడదీసిన పదాలకూ, కలిపిన పదాలకూ తేడా గమనించండి. కలిపిన పదంలో ‘ము’ కు బదులుగా సున్న(0) వచ్చింది. మరో దానిలో ‘ము’ లోపించింది.

పడ్వాది సంధి సూత్రం :
పడ్వాదులు పరమగునపుడు ‘ము’ వర్ణకానికి లోపమూ, పూర్ణబిందువూ (0) విభాషగా అవుతాయి.

గమనిక :
పడ్వాదులు = పడు , పట్టె, పాటు అనేవి.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

12. త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఈ కింది ఉదాహరణ చూడండి
అక్కొమరుండు = ఆ + కొమరుండు
ఆ + కొమరుడు = అనే దానిలో ‘ఆ’, త్రికంలో ఒకటి. ఇది ‘అ’ గా మారింది. సంయుక్తాక్షరం కాని హల్లు ‘కొ’ ద్విత్వంగా ‘క్కొ’ గా మారింది.

అలాగే ఈ, ఏలు అనే త్రికములు కూడా, , ఎలుగా మారుతాయి.
ఉదా :
ఈ + కాలము = ఇక్కాలము
ఏ + వాడు : ఎవ్వాడు

త్రికసంధి సూత్రం :
త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా :
ఈ + క్కాలము
ఏ + వ్వాడు.

సూత్రం 2 : ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్ఛిక దీర్ఘానికి హ్రస్వం అవుతుంది.
ఉదా :
1)
ఇక్కాలము
2)
ఎవ్వాడు

13. రుగాగమ సంధి
సూత్రం : పేదాది శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
ఉదా :
పేద + ఆలు = పేద + ర్ + ఆలు = పేదరాలు

పై రెండు పదాలకు మధ్య ” అనేది వచ్చి, ప్రక్కనున్న ‘ఆ’ అనే అచ్చుతో కలిస్తే ‘రా’ అయింది. అదెలా వస్తుందంటే, పేద, బీద, బాలింత ఇలాంటి పదాలకు ‘ఆలు’ అనే శబ్దం పరమైతే, ఇలా ‘రుగాగమం” అంటే ‘5’ వస్తుంది.

ఆగమం :
రెండు పదాలలో ఏ అక్షరాన్ని కొట్టివేయకుండా, కొత్తగా అక్షరం వస్తే “ఆగమం” అంటారు.

రుగాగమ సంధి సూత్రం (1) :
పేదాది శబ్దములకు ‘ఆలు’ శబ్దంపరమైతే, కర్మధారయంలో రుగాగమం వస్తుంది.
పేద (విశేషణం) – ఆలు (స్త్రీ) నామము
విశేషణం = నామం మనుమ + ఆలు = మనుమరాలు బాలింత + ఆలు = బాలింతరాలు

రుగాగమ సంధి సూత్రం (2) :
కర్మధారయంలో తత్సమ పదాలకు, ఆలు శబ్దం పరమైతే, పూర్వ పదం చివరనున్న అత్వానికి ఉత్వమూ, రుగాగమం వస్తాయి.
ఉదా :
ధీరురాలు = ధీర + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
విద్యావంతురాలు = విద్యావంత + ఆలు

సంస్కృత సంధులు

1. సవర్ణదీర్ఘ సంధి
సూత్రం : అ, , , ఋ అనే వర్ణాలకు అవే వర్ణాలు సవర్ణాలు కలిసినప్పుడు, దీర్ఘం తప్పనిసరిగా వస్తుంది.
గమనిక :
అ’ వర్ణానికి – ‘అ’, ఆ – లు సవర్ణాలు
ఇ’ వర్ణానికి – ‘ఇ, ఈ లు’ – సవర్ణాలు
ఉ’ వర్ణానికి – ‘ఉ, ఊ లు’ – సవర్ణాలు
ఋ’ వర్ణానికి – ‘ఋ, ౠ లు’ – సవర్ణాలు

ఉదా :
1)
రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
2)
రామాలయం = రామ + ఆలయం = అ + ఆ = ఆ) = సవర్ణదీర్ఘ సంధి
3)
కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ) = సవర్ణదీర్ఘ సంధి
4)
భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
5)
వధూపేతుడు = వధూ + ఉపేతుడు : (ఊ + ఉ = ఊ) = సవర్ణదీర్ఘ సంధి
6)
పిత్రణం = పితృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి
7)
మాతౄణం = మాతృ + ఋణం = (ఋ + ఋ = ౠ) = సవర్ణదీర్ఘ సంధి

2. గుణ సంధి
సూత్రం : అకారానికి ఇ, , ఋ లు పరమైతే ఏ, , అర్ లు ఏకాదేశంగా వస్తాయి.
1.
ఉదా :
రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు = (అ + ఇ = గుణ సంధి
మహేంద్రుడు = మహా + ఇంద్రుడు – (ఆ + ఇ = ఏ) = గుణ సంధి
నరేంద్రుడు : నర + ఇంద్రుడు = (అ + ఇ = ఏ) = గుణ సంధి

2. ఉదా :
పరోపకారం = పర + ఉపకారం = గుణ సంధి
మహోన్నతి = మహా + ఉన్నతి – (ఆ + ఉ + ఓ) గుణ సంధి
దేశోన్నతి = దేశ + ఉన్నతి = (ఆ + ఉ + ఓ) = గుణ సంధి
గృహోపకరణం = గృహ + ఉపకరణం = (అ + ఉ = ఓ) = గుణ సంధి

3. ఉదా :
రాజర్షి = రాజ + ఋషి – (అ + ఋ = అర్) – గుణ సంధి
మహర్షి = మహా + ఋషి – (ఆ + ఋ = అర్) – గుణ సంధి

గమనిక :
1)
, ఆ లకు, , ఈ లు కలిసి ‘ఏ’ గా మారడం
2)
, ఆ లకు, , ఊ లు కలిసి ‘ఓ’ గా మారడం
3)
, ఆ లకు, , ౠ లు కలిసి ‘అర్’ గా మారడం.

పై మూడు సందర్భాల్లోనూ, పూర్వ స్వరం అంటే, సంధి విడదీసినపుడు, మొదటి పదం చివరి అచ్చు, , ఆ లుగా ఉంది. పర స్వరం, అంటే విడదీసిన రెండవ పదంలో మొదటి అచ్చులు ఇ, , ఋ – లుగా ఉన్నాయి.
గమనిక :
1)
, ఆ లకు – ‘ఇ’ కలిస్తే ‘ఏ’ గా మారుతుంది.
2)
, ఆ లకు – ‘ఉ’ కలిస్తే ‘ఓ’ గా మారుతుంది.
3)
, ఆ లకు – ‘ఋ’ కలిస్తే ‘అర్’ గా మారుతుంది.

గమనిక :
, , అర్ అనే వాటిని గుణాలు అంటారు. ఇలా గుణాలు వచ్చే సంధిని “గుణ సంధి” అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

3. యణాదేశ సంధి
సూత్రం : ఇ, , , లకు, అసవర్ణాచ్చులు పరమైతే య, , ర లు ఆదేశంగా వస్తాయి.
ఈ కింది పదాలను విడదీయండి. మార్పును గమనించండి.
ఉదా :
అ) అత్యానందం. = అతి + ఆనందం = (త్ + ఇ + ఆ = యా) = యణాదేశ సంధి
1)
అత్యంతం = అతి + అంతం = (అత్ + ఇ + అ + య) = యణాదేశ సంధి

ఉదా :
ఆ) అణ్వస్త్రం = అస్త్రం = (ణ్ + ఉ + అ = వ) = యణాదేశ సంధి
2)
గుర్వాజ్ఞ = గురు + ఆజ్ఞ . : (ర్ + ఉ + ఆ = వ) = యణాదేశ సంధి

ఉదా :
ఇ) పిత్రాజ్ఞ = పితృ + ఆజ్ఞ = (ఋు + ఆ = రా) = యణాదేశ సంధి
3)
మాత్రంశ = మాతృ + అంశ = (ఋ + అ = 6). = యణాదేశ సంధి

గమనిక :
, , ఋ లకు అసవర్ణాచ్చులు (వేరే అచ్చులు) పక్కన వచ్చినపుడు, క్రమంగా వాటికి య – వ – ర లు వచ్చాయి. యవరలను ‘యణులు’ అంటారు. యజ్ఞులు చేరితే వచ్చే సంధిని, యణాదేశ సంధి, అంటారు. యణాదేశ సంధిలో, ‘ఇ’ కి బదులుగా “య్”, ‘ఉ’ కి బదులుగా ‘ఏ’, ‘ఋ’ కి బదులుగా ‘5’ వచ్చాయి.

యణాదేశ సంధి సూత్రం : ఇ, , ఋ లకు, అసవర్ణాచ్చులు పరమైతే, , , ర లు ఆదేశంగా వస్తాయి.

4. వృద్ధి సంధి
సూత్రం : అకారానికి ఏ, ఐలు పరమైతే ‘ఐ’ కారమూ, , ఔ లు పరమైతే ‘ఔ’ కారము వస్తాయి.

ఈ కింది పదాలను విడదీయండి.
1.
ఉదా :
వసుధైక = వసుధా + ఏక = (ఆ + ఏ = ఐ) = వృద్ధి సంధి
అ) రసైక = రస + ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి
ఆ) సురైక ఏక = (అ + ఏ = ఐ) = వృద్ధి సంధి

2. సమైక్యం = సమ + ఐక్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఇ) అష్టైశ్వర్యం = అష్ట + ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి
ఈ) దేవైశ్వర్యం = ఐశ్వర్యం = (అ + ఐ = ఐ) = వృద్ధి సంధి

3. పాపౌఘము = ఓఘము = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఉ) వనౌకసులు = ఓకసులు = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి
ఊ) వనౌషధి = వన ఓషధి = (అ + ఓ = ఔ) = వృద్ధి సంధి

4. రసౌచిత్యం = రస + ఔచిత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దివ్యాషధం = దివ్య + ఔషధం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి
ఋ) దేశాన్నత్యం = దేశ + ఔన్నత్యం = (అ + ఔ = ఔ) = వృద్ధి సంధి

గమనిక :
పైన పేర్కొన్న పదాలను విడదీసినపుడు మీరు గమనింపదగిన విషయం ఇది.
1.
వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు, ప్రతిసారీ పూర్వ స్వరంగా ‘అ’ వచ్చింది.
2.
పర స్వరం స్థానంలో వరుసగా “ఏ, , , ఔ” లు ఉన్నాయి.
3.
అకారానికి ఏ, ఐ లు కలిపినపుడు ‘ఐ’ వచ్చింది.
4.
అకారానికి ఓ, ఔ లు కలిపినపుడు ‘ఔ’ వచ్చింది.

వృద్ధి సంధి సూత్రం :
అకారానికి ఏ, ఐ లు పరమైనపుడు ఐకారమూ, , ఔ లు పరమైతే ఔ కారమూ వస్తాయి.
వృద్ధులు = ఐ, ఔ లను ‘వృద్ధులు’ అంటారు.

AP Board 9th Class Telugu Grammar Chandassu ఛందస్సు

5. జశ్వ సంధి
సూత్రం : “పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శ ష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.
ఉదా :
సత్ + భక్తులు = సద్ + భక్తులు = సద్భక్తులు
పై సంధి పదాలను పరిశీలించండి. మొదట విడదీసిన పదాలలోని ‘త’ కార స్థానములో ‘ద’ కారం ఆదేశంగా వచ్చి, ‘సద్భక్తులు’ అనే రూపం వచ్చింది.

గమనిక :
ఈ విధంగా మొదటి పదం చివర, , , , , ప (పరుషాలు) లలో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం మొదట క ఖ, చ ఛ, ట ఠ, త థ, ప ఫ, లు మరియు శ ష స లు తప్ప, మిగిలిన హల్లులూ, అచ్చులలో ఏ అక్షరం ఉన్నా ‘గ, , , , బ’ లు వరుసగా ఆదేశం అవుతాయి.

కింది పదాలను విడదీయండి.
1)
దిగంతము = దిక్ + అంతము = జశ్వ సంధి
2)
మృదటము = మృత్ + ఘటము = జశ్వ సంధి
3)
ఉదంచద్భక్తి = ఉదంచత్ + భక్తి = జశ్వ సంధి
4)
వాగీశుడు = వాక్ + ఈశుడు = జశ్వ సంధి
5)
వాగ్యుద్ధం = వాక్ + యుద్ధం = జ్వ సంధి
6)
వాగ్వాదం = వాక్ + వాదం = జశ్వ సంధి
7)
తద్విధం = తత్ + విధం = జశ్వ సంధి

జశ్వసంధి సూత్రం :
పరుషములకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, శష స లు తప్ప, మిగిలిన హల్లులు కానీ, అచ్చులు కానీ పరమైతే వరుసగా సరళాలు ఆదేశమవుతాయి.