Hot Widget

Ticker

6/recent/ticker-posts

రామాయణం ఘటనలు - స్థలాలు ప్రస్తుత కొత్త పేర్లు

*🙏🙏నమస్కారం🙏🙏*

*ప్రాచీన ప్రదేశాలు – ఆధునిక నామధేయాలు*
*రామాయణం*

1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – *గంగోత్రి, ఉత్తరాఖండ్*

2. కపిల మహర్షి ఆశ్రమం, (శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) – *గంగాసాగర్, వెస్ట్ బెంగాల్*

3. కాంభోజ రాజ్యం – *ఇరాన్* ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం *ఉజ్బెకిస్తాన్,* *తజకిస్తాన్,* *కజఖిస్తాన్* దాటి యింతవరకూ విస్తరించింది).

4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- *లాంగకో, టిబెట్, చైనా*

5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు – *గోకర్ణ, కర్ణాటక*

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు – *సీతామర్హి, బీహార్*

7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – *జనక్ పూర్, నేపాల్*

8. కోసలదేశం – రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – *ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్.*

10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – *ఘాఘర* నది.

11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) – *అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్.*

12. తాటక వధ జరిగిన ప్రదేశం – *బక్సర్, బీహార్*

13. అహల్య శాపవిమోచన స్థలం – *అహిరౌలి, బీహార్*

14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) – *సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్*

15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు – *శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర*

16 దండకారణ్యం – *చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.*

17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చేసిన చోటు) – *సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.*

18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) – *నాసిక్, మహరాష్ట్ర.*

19. కబంధాశ్రమం – *కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.*

20. శబరి ఆశ్రమం – *సర్బన్, బెల్గావి, కర్ణాటక.*

21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం – *హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.*

22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం - *తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక*

23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం – *ధనుష్కొటి, తమిళనాడు.*

24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు - *రామేశ్వరం, తమిళనాడు*

25. రత్నద్వీపం / సింహళం / లంక – *శ్రీలంక.*

26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) – *కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక*

27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు – *దునువిల్ల, శ్రీలంక*

28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం – *దివిరుంపోల, శ్రీలంక.*

29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం – *ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.*

30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – *కుశార్, పాకిస్తాన్.*

31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – *లాహోర్, పాకిస్తాన్*

32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – *తక్షశిల, పాకిస్తాన్*

33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించెను

ఇది సేకరణ🙏🙏🙏🙏🙏🙏